Home
Posted on 08-11-03
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రజాహిత బస్సు యాత్ర తెలంగాణలోకి ప్రవేశించేలోగా తెలంగాణకు ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)ని ప్రకటించాలని తెలంగాణ కాంగ్రెస్ ఫోరమ్ (సిఎఫ్‌టి) నాయకులు పార్టీ హైకమాండ్‌ను కోరారు. కాంగ్రెస్ ప్రజాహిత బస్సు యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో సాగుతున్న విషయంలో తెలిసిందే.
తెలంగాణకు ప్రత్యేక పిసిసిని ఏర్పాటు చేసే వరకు తెలంగాణలో బస్సు యాత్రను వాయిదా వేయాలని సిఎఫ్‌టి నాయకులు జి. చిన్నారెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, తదితరులు శనివారం విలేకరుల సమావేశంలో పార్టీ హైకమాండ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక పిసిసిని ఏర్పాటు చేయకపోతే తాము తీవ్ర చర్యలకు దిగుతామని వారు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
