Home
Posted on 08-11-03
హైదరాబాద్: నక్సలైట్ల దాడిలో గాయపడిన మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి తెలుగుదేశం శాసనసభ్యుడు జైపాల్ యాదవ్‌ను, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతి రెడ్డిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం పరామర్శించారు. వీరిద్దరు హైదరాబాద్‌లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చికిత్స పొందుతున్నారు.
నక్సలైట్ల హింస ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా అన్నారు. దాడి విషయంలో ఇంటిలిజెన్స్ వైఫల్యం ఉన్నదనే విమర్శలను ఆయన అంగీకరించలేదు. నక్సలైట్ల హింసను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నక్సలైట్లు తమ విధానాలపై పునరాలోచన చేసుకోవాలని కూడా ఆయన అన్నారు.
జైపాల్ యాదవ్‌పై నక్సలైట్లు శుక్రవారం సాయంత్రం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జైపాల్‌తో పాటు వాహనంలో ఉన్న ప్రభుత్వాధికారి తిరుపతిరెడ్డి గాయపడ్డారు. తిరుపతిరెడ్డి మెడ మీద శస్త్రచికిత్స చేసి గుండు బయటకు తీస్తారు.












Click it and Unblock the Notifications
