Home

Posted on 08-11-03

పెద్దపల్లి రైతుల రాస్తారోకో

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా రైతులు శనివారం పెద్దపల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లోని అధికారులు, వ్యాపారుల కుమ్మక్కయి హమాలీల చేత తమపై దాడులు చేయిస్తున్నారని ఆరోపిస్తూ వారు ఈ రాస్తారోకో నిర్వహించారు.

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం రాత్రి హమాలీలు పత్తిరైతులపై దాడి చేశారు. తమ హమాలీల దాడి వెనుక అధికారుల, వ్యాపారుల హస్తం ఉన్నదని వారు ఆరోపించారు. తమను కొడితే హమాలీలకు ఒరిగేదమిటని వారు ప్రశ్నించారు. తూకంలో మోసం కూడా చేస్తున్నారని వారన్నారు. పెద్దపల్లి ఆర్డీవో హామీతో రైతులు తమ రాస్తారోకోను విరమించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+