Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!
నక్సలైట్లకు చంద్రబాబు సవాల్
హైదరాబాద్: ప్రజా మద్దుతును ధృవీకరించుకోవడానికి ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నక్సలైట్లకు సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, అందువల్ల నక్సలైట్లు ఆయుధాలు విడనాడాలని ఆయన అన్నారు. ప్రైవేట్ టీవీ చానల్ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఎన్నికల్లో పాల్గొని ప్రజా మద్దతు ఉన్నదని నక్సలైట్లు నిరూపించుకోవాలని ఆయన అన్నారు. తుపాకి గొట్టం ద్వారా విప్లవం సాధిస్తామనేది కాలం చెల్లిన సిద్ధాంతమని ఆయన అన్నారు. ప్రజా సేవ చేయడానికి ప్రస్తుత ప్రజాస్వామిక వ్యవస్థ అన్ని అవకాశాలు కల్పిస్తున్నదని ఆయన అన్నారు. | ||