Home
Posted on 10-11-03
హైదరాబాద్: అలిపిరిదాడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తీవ్రంగాగాయపడి సురక్షితంగా బయటపడ్డ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా పబ్లిక్‌దర్శన్ లు ప్రారంభించారు. కాకపోతే, ఆయన ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడిలా బహిరంగసభలకుహాజరుకావడంలేదు. ఇంకా పూర్తిగా మానసికంగాకోలుకున్నాకే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికి ఆయన సినిమా కార్యక్రమాలకు హాజరవుతూ మనసును ఆహ్లదపరుచుకుంటున్నారు.
శనివారం హైదరాబాద్‌లో ఓ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి విచ్చేసి సరదాగాగడిపారు. అయితే, రాజకీయనాయకులు ఎక్కడైనారాజకీయ నాయకులు అన్నట్లు ఆయన ఆ కార్యక్రమంలోనూరాజకీయ ప్రసంగమే చేశారు. అలిపిరి ఘటననుమరోసారి గుర్తు చేసుకున్నారు. ఇదే కార్యక్రమానికి ప్రమాదానికిగురై సురక్షితంగా బయటపడ్డ మరో వ్యక్తి హాజరుకావడంవిశేషం. అతను ఎవరో కాదు క్యారక్టర్ ఆర్టిస్ట్‌శివాజీరాజా.












Click it and Unblock the Notifications
