Home
Posted on 10-11-03
హైదరాబాద్: 610 జీవో అమలుపై సభాసంఘం పూర్తి సమాచారం ఇవ్వడం లేదని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. సభా సంఘం 25 సార్లు సమావేశమైనప్పటికీ పూర్తి సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని వారన్నారు.
610 జీవోపై తెలుగుదేశం శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటయిన శాసనసభా సంఘం సోమవారం సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) హాజరు కాలేదు. కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం శాసనసభ్యులు హాజరయ్యారు. కొన్ని శాఖలకు సంబంధించిన వివాదాలు కోర్టులో ఉన్నందున వాటిని వివరించలేకపోతున్నట్లు ప్రకాశ్ రెడ్డి చెప్పారు.
మెడికల్, ఇంజనీరింగ్ అడ్మిషన్లను సభా సంఘం సమీక్షించింది. రెసిడెన్షియల్ పాఠశాలలో మోసాలపై 15 రోజుల లోపల అఫడవిట్ దాఖలు చేయాల్సి ఉన్నదని, అయితే ప్రభుత్వం ఆ అఫడవిట్‌ను దాఖలు చేయలేదని, ఇది 610 జీవో అమలు పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని తెలియజేస్తున్నదని ఇంద్రకరణ్ రెడ్డి (కాంగ్రెస్) అన్నారు.












Click it and Unblock the Notifications
