Home
Posted on 10-11-03
సూర్యాపేట: తాము అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉన్నామని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) అధికార ప్రతినిధి ఎస్. జైపాల్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన సోమవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో అన్నారు.
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం కోటి వరాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయ విమర్శించారు. గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమలు చేయకుండానే కొత్త వాగ్దానాలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం ఎనిమిదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిపై నివేదిక విడుదల చేయాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
