Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!
కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం
వరంగల్: వరంగల్ జిల్లా కోర్టు ఆవరణలో ఒక వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. న్యాయవాదులు అడ్డుపడి అతడ్ని పోలీసులకు అప్పగించారు. వరంగల్ మహబూబాబాద్ డిపోకు చెందిన బస్సు కండకర్ అమీర్ బాష తన భార్యకు, పిల్లలకు ఇవ్వాల్సిన భరణం విషయంలో లాయర్లపై ఆరోపణలు చేస్తూ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. తన లాయర్, ప్రతికక్షి లాయర్ కుమ్మక్కయి భరణం పెంచారని, న్యాయమూర్తి కూడా తన వాదనను వినిపించుకోవడం లేదని, దీంతో కలత చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అమీర్ బాష అన్నాడు. భార్య నుంచి విడాకులు తీసుకున్న అమీర్ బాష భార్యాపిల్లలకు నెలకు 300 రూపాయల భరణం చెల్లిస్తూ వస్తున్నాడు. దీన్ని వేయి రూపాయలకు పెంచారు. అలా పెంచడాన్ని అమీర్ బాష వ్యతిరేకిస్తున్నాడు. భరణం వేయి రూపాయలు ఇవ్వడానికి అంగీకరించిన అమీర్ బాష ఇప్పుడు మాట మారుస్తున్నాడని ప్రతికక్షి లాయర్ అంటున్నారు. | ||