Home
Posted on 11-11-03
న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వేదిక నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు.
రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో వ్యూహాన్ని ఖరారు చేసేందుకు రాష్ట్ర పార్టీ నాయకులను కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించింది. శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి బుధవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని బుధవారం కలిసే అవకాశాలున్నాయి. దీనికి ముందు వారు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తో పాటు ఇతర సీనియర్ నేతలతో సమావేశమవుతారు. ఒకటి, రెండు రోజుల్లో అందర్నీ కలుస్తామని శ్రీనివాస్ చెప్పారు.












Click it and Unblock the Notifications
