Home
Posted on 11-11-03
హైదరాబాద్: పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్)లో చేరడానికి సిద్ధపడిన ప్రభుత్వ రంగ సంస్థల ఉప కార్యదర్శి నారాయణకు పదోన్నతి లభించింది. తన పదవికి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధపడిన నారాయణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జోక్యంతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.
పదోన్నతి కల్పిస్తూ నారాయణను ప్రభుత్వం ఛీఫ్ రేషనింగ్ ఆఫీసరుగా నియమించింది. సోమవారంనాడు పెద్ద యెత్తున ఐపియస్ అధికారులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు ఎనమండుగురు ఐఎయస్ అధికారులను బదిలీ చేసింది. నారాయణతో పాటు బి. వేంకటేశ్వరరావు, ఉషారాణి, ఎ. అశోక్, ప్రవీణ్ ప్రకాశ్, ఎల్. శశిధర్, అనిల్ కుమార్, రామాంజనేయులను ప్రభుత్వం బదిలీ చేసింది. అనిల్ కుమార్ నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, అశోక్ మహబూబ్‌నగర్ జాయింట్ కలెక్టర్‌గా, ఉషారాణి విజయవాడ మున్సిపల్ కమీషనర్‌గా నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications
