Home
Posted on 11-11-03
బెంగుళూర్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు భారత ఫాస్ట్ బౌలర్ జువగళ్ శ్రీనాధ్ ప్రకటించారు. 12 యేళ్ల పాటు ఆయన భారత క్రికెట్ క్రీడకు తన సేవలను అందించారు.
గత కొద్ది కాలంగా శ్రీనాథ్ గాయాల బారిన పడుతూ వస్తున్నారు. తాను రిటైర్ కావాలనుకుంటున్నానని, ఈ విషయాన్ని ఈ సాయంత్రం అధికారికంగా ప్రకటిస్తానని 34 యేళ్ల శ్రీనాథ్ చెప్పారు. 67 టెస్టు మ్యాచ్‌లు ఆడిన శ్రీనాథ్ 236 వికెట్లు తీసుకున్నాడు. పది సార్లు ఐదేసి వికెట్లు తీసుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీసుకోవడం శ్రీనాథ్ కెరీర్‌లో అత్యుత్తమమైనది. 229 వన్డే మ్యాచ్‌ల్లో శ్రీనాథ్ 315 వికెట్లు పడగొట్టాడు.












Click it and Unblock the Notifications
