Home

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 11-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

స్టాంపుల స్కామ్‌పై సిబిఐకి నో

ముంబాయి: నకిలీ స్టాంపుల కుంభకోణంపై సిబిఐ దర్యాప్తునకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే నిరాకరించారు. స్టాంపుల కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు కోరాలని శివసేన, భారతీయ జనతా పార్టీ (బిజెపి) డిమాండ్‌ చేశాయి. ఆయన మంగళవారం ఉదయం గవర్నర్‌ మొహమ్మద్‌ ఫజల్‌ను కలిసి స్టాంపుల కుంభకోణం కేసు వివరాలను తెలియజేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎనమండుగురు పోలీసు అధికారులను అరెస్టు చేశారు.

గవర్నర్‌కు, తనకు మధ్య జరిగిన చర్చల వివరాలను వెల్లడించడానికి షిండే నిరాకరించారు. గవర్నర్‌తో ఆయన దాదాపు 35 నిమిషాల సేపు మాట్లాడారు. తమ చర్చల్లో స్టాంపుల కుంభకోణం ప్రస్తావనకు వచ్చిందని మాత్రం ఆయన విలేకరులతో చెప్పారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సంతృప్తికరంగా సాగుతున్నందున కేసును సిబిఐకి అప్పగించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అమోఘంగా పని చేస్తోందని, సిట్‌ దర్యాప్తుపై పూర్తి విశ్వాసం ఉన్నదని, ఈ కేసులో సీనియర్‌ పోలీసు అధికారులను కూడా అరెస్టు చేశారని ఆయన అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి