Home

Posted on 11-11-03

టిడిపి గెలిస్తే హిందూ ఎజెండాకు బలం

శ్రీకాకుళం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి గెలిస్తే హిందూ ఎజెండాకు బలం చేకూరుతందని విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి) నేత అశోక్‌ సింఘాలు అన్నారు. ఆయన మంగళవారం శ్రీకాకుళం వచ్చారు. ఇక్కడ ఆయన శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామిని కలుసుకున్నారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి హిందూ మతపెద్దలు సహకరించాలని ఆయన కోరారు. ఐఎస్‌ఐ, నక్సలైట్ల కదలికల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఉమ్మడి పౌరస్మృతి, ఇతర విషయాల్లో ఆంధ్రప్రదేశ్‌ తమకు సహకరిస్తుందనే నమ్మకం ఉన్నదని ఆయన అన్నారు. దేశాన్ని క్రైస్తవులతో నింపేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+