గోదావరిలోనూ బాబు వరాల జల్లు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 12-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

రాజమండ్రి: బుధవారం ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు ఉభయ గోదావరిజిల్లాల్లో సుడిగాలి పర్యటన జరిపారు. ఆయనబుధవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాతూర్పవడ్లపల్లి దేవాలయంలో పూజలు నిర్వహించి తన పర్యటనను ప్రారంభించారు.పశ్చిమ గోదావరిజిల్లాలో ఆయన మూడు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనచేస్తారు. తూర్పు గోదావరి జిల్లాలో పుష్కర ఎత్తిపోతలపథకానికి శంకుస్థాపన చేశారు.

దీని వల్ల 2 లక్షల ఎకరాలకు సాగునీరుఅందుతుంది. లబ్ధిదారులకు పనిముట్లు, బాలికలకుసైకిళ్లు పంపిణీ చేశారు. బీసీలపై మరోసారి కనికరం చూపుతూ 500 కోట్లవిలువ చేసే వివిధ రకాల వరాలను ఆయనప్రకటించారు. బస్సుయాత్ర ఉభయ గోదావరిజిల్లాల్లో ముగిసిన అనంతరం చంద్రబాబు పర్యటన ఈజిల్లాల్లో సాగడం విశేషం. ఆద్యంతం ఆయన పర్యటన ఎన్నికల పర్యటనను తలపించింది.బహిరంగసభలోనూ ఎన్నికల ప్రచారం మాదిరిగాప్రసంగించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X