Home
Posted on 12-11-03
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అకస్మాత్తుగా ఏర్పాటుచేసిన పార్టీ సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే ఈ సమావేశానికి ఏడువేల మంది తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు హాజరవుతారు. ముందస్తు ఎన్నికలు సహా అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు హోంమంత్రి టి.దేవేందర్ గౌడ్ బుధవారం విలేకరులకు తెలిపారు. ముందస్తు ఎన్నికల గురించి చర్చిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన అన్నింటిని చర్చిస్తామని సమాధానమిచ్చారు.
పాలిట్ బ్యూరో ఆమోదించిన తీర్మానాలను సాయంత్రం జరిగే సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతారు. అలిపిరి ఘటనను ఖండిస్తూ తీర్మానంతో పాటు ప్రజలకు ధన్వవాదాలు తెలిపే తీర్మానాన్ని కూడా ఇందులో ప్రకటిస్తారు. అయితే, ఈ సమవేశాన్ని ముందస్థు ఎన్నికలకు పార్టీ ఆమోదాన్ని లాంఛనంగా తీసుకునే ప్రక్రియగా రాజకీయపరిశీలకులు అభివర్ణిస్తున్నారు. గురువారం ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ రద్దును ఎప్పుడు ప్రకటిస్తారనేది తేలుతుంది.












Click it and Unblock the Notifications
