టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ ఎన్నికల పొత్తు!

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 12-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూఢిల్లీ, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి,కాంగ్రెస్‌ లు ఎన్నికల పొత్తును కుదుర్చుకునేదిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. తెలంగాణకాంగ్రెస్‌ వేదిక డిమాండ్‌ నేపథ్యంలో అధిష్టానం తెలంగాణపై రెండురోజుల్లో ఓ ప్రకటన చేయనుంది. ప్రస్తుతం గులాంనబీ ఆజాద్‌ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, సీఎల్పీ నేతవై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు.

బుధవారం వీరివురితోఆయన జరిపిన చర్చల్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తుగురించే చర్చ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మరోవైపు, కాంగ్రెస్‌ తో ఎన్నికల పొత్తుకుచర్చలు జరుగుతున్నాయని టీఆర్‌ ఎస్‌ అధ్యక్షుడుకె.చంద్రశేఖర్‌ రావు బుధవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే,వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.చర్చలు జరుగుతున్న మాట వాస్తవం. ఇప్పుడే ఏవిషయం మాత్రం వెల్లడించలేనని ఆయనఅన్నారు. మరోవైపు, న్యూఢిల్లీలోనే మకాంవేసిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు గురువారం గులాంనబీ ఆజాద్‌ తో సమావేశం కానున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X