సానుభూతి అవసరం లేదు: బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 13-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: తమకు ప్రజల సానుభూతి అవసరం లేదని, వారి అవగాహనతో కూడిన తీర్పు కావాలని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. తమకు అధికారం ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు.

గురువారం ఇక్కడి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటయిన పార్టీ అత్యవసరసర్వప్రతినిధి సభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఆయన ప్రసంగం దాదాపు గంటన్నరసేపు సాగింది. దాదాపు ప్రతి విషయాన్ని తడిమారు. కాంగ్రెస్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కృషి చేసిందని ఆయన చెప్పారు. తాము ప్రజలతో ఉన్నామని, ప్రజల భాగస్వామ్యంతో పాలన సాగిస్తున్నామని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతామనే ఉద్దేశంతో, మంచి పాలనఅందుతుందనే ఉద్దేశంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారని ఆయన చెప్పారు.

తెలుగుదేశం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, సమగ్రాభివృద్ధి కోసం పని చేస్తున్నామని, ఈ తరుణంలో కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. ప్రజల కోసం తాము ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని ఆయన చెప్పారు. నిస్వార్థంగా పని చేసే నాయత్వం తెలుగుదేశం పార్టీకి ఉన్నదని ఆయన అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి