స్టాంపుల కేసుపై సిబిఐ దర్యాప్తు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 13-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

నాగపూర్‌ః నకిలీ స్టాంపుల కుంభకోణంపై సిబిఐదర్యాప్తు జరుపనుంది. ఈ కేసును దర్యాప్తుచేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరిన పర్యవసానంగా సిబిఐ రంగంలోకిదిగనుంది. నాగపూర్‌ లో సిబిఐ అధికారుల గృహసముదాయాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చిన సిబిఐడైరెక్టర్‌ పిసి శర్మ విలేకరుల ప్రశ్నలకు సమాధానంగాఆయన ఈ విషయం చెప్పారు.

ఈ కేసులో తెలుగుదేశం ఎమ్మెల్యేకృష్ణాయాదవ్‌ అరెస్టు కావడంతో మరికొందరుతెలుగుదేశం నాయకులకు ఈ కుంభకోణంలోప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షాల డిమాండ్‌మేరకు ఈ కేసును సిబిఐకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వంఅంగీకరించింది. ఇటువంటి కేసులను కేంద్రం గానీ రాష్ట్రప్రభుత్వాలు గానీ కోరినప్పుడే సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందనిఆయన సిబిఐ డైరెక్టర్‌ అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి