610 జీవోపై సమావేశ బహిష్కరణ

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 13-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: 610జీవో అమలుపై మరో మధ్యంతర నివేదికను విడుదల చేయడానికి ఆజీవో అమలుపై విచారణ జరుపుతన్న శాసనసభా సంఘం ప్రయత్నించింది. ఈ ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. సమావేశాన్ని బహిష్కరించాయి.

సభా సంఘానికి అన్ని శాఖలు సమాచారంఅందించలేదని, ఇప్పటికే ఒక నివేదిక సమర్పించామని, ఇటువంటి స్థితిలో మరో మధ్యంతర నివేదిక అవసరం లేదని ప్రతిపక్షాలువాదించాయి. జీవో అమలును పరిశీలించేందుకు 61 ప్రభుత్వ శాఖలు మాత్రమే సమాచారం ఇచ్చాయని, మరో 67 శాఖలు సమాచారం ఇవ్వలేదని బి. వెంకటేశ్వర్లు(కాంగ్రెస్‌) అన్నారు.

గత నివేదికనే అమలు చేయలేదని, అటువంటప్పుడు మరో మధ్యంతర నివేదిక అవసరం ఏమిటని, తప్పుడు సమాచారం ఇస్తున్నారనికె. చంద్రశేఖర్‌ రావు (టిఆర్‌ఎస్‌) అన్నారు. జీవోను అమలు చేయని అధికారులపై చర్య తీసుకోవడం లేదని ఆయన అన్నారు. నోముల నరసింహయ్య(సిపిఎం) కూడా రెండు మధ్యంతర నివేదిక సమర్పణ ప్రయత్నాన్ని వ్యతిరేకించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X