ఐక్యంగా బాబును ఓడించండి: సోనియా

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 13-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూఢిల్లీ: ఐకమత్యంగా పని చేసి వచ్చే శాసనసభ ఎన్నికల్లో నారా చంద్రబాబునాయుడును ఓడించాలని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ(ఎఐసిసి) అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకు సూచించారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ గురువారం ఉదయం సోనియాతో చర్చలు జరిపారు.

రాష్ట్రంలో వామపక్షాలతో, తెలంగాణ రాష్ట్ర సమితితో ఎన్నికల పొత్తు ఉంటాయని శ్రీనివాస్‌ సూచనప్రాయంగా తెలియజేశారు. ఎన్నికల పొత్తుపై ఉభయ కమ్యూనిస్టు పార్టీతో చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. టిఆర్‌ఎస్‌ నుంచి అనుకూల స్పందన రావాల్సి ఉన్నదని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తుల వ్యవహారాలు ఒకటి, రెండు రోజుల్లో తేలుతాయని ఆయన చెప్పారు. సోనియా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తో కూడా మాట్లాడారు.

తెలంగాణకు ప్రత్యేక ఎన్నికల కమిటీని వేయాలని తెలంగాణసీనియర్‌ నేతలు కోరారు. వీరు గులాం నబీ ఆజాద్‌తో చర్చించారు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌పై అధిష్ఠానవర్గం నేతలు ఎవరూ నోరు మెదపడం లేదు. తెలంగాణఅంశం ఒకటి రెండు రోజుల్లో తేలుతుందని ఎఐసిసి కార్యదర్శిఆర్‌.పి. సింగ్‌ చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X