రాష్ట్రపతి పాలనకు కాంగ్రెస్‌ డిమాండ్‌

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 14-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూఢిల్లీ/హైదరాబాద్‌:వచ్చే శాసనసభ ఎన్నికల్లో పెట్టుకోవాల్సిన పొత్తులపై తమ నేతసోనియా గాంధీతో చర్చించలేదని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నాయకుడు డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిచెప్పారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుడి.శ్రీనివాస్‌, రాజశేఖర్‌ రెడ్డి శుక్రవారం సోనియా గాంధీని కలిసి మాట్లాడారు.

ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేవిషయాన్ని ఆలోచించడానికి ఇంకా నెల రోజులగడువు ఉన్నదని రాజశేఖర్‌ రెడ్డి సోనియాతో మాట్లాడన అనంతరంవిలేకరులతో అన్నారు. పొత్తులకు తొందర లేదనిఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో అనుసరించాల్సినవ్యూహం గురించి సోనియాతో రాష్ట్ర నాయకులుచర్చించారు.ఈ సమావేశంలో ఎఐసిసి పరిశీలకులు, పర్యవేక్షకులు కూడాపాల్గొన్నారు.

ముందస్తు ఎన్నికలు ఊహించినవేననిశ్రీనివాస్‌ అన్నారు. పాలించే చేవలేకనే చంద్రబాబునాయుడు శాసనసభరద్దుకు సిఫార్సు చేశారని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు అనవసరంగా తమపై నిందలు వేస్తున్నారనిఆయన అన్నారు. ఏం చేయాలనుకున్న చంద్రబాబుకు పూర్తిమెజారిటి ఉన్నదని, అటువంటప్పుడు ప్రతిపక్షాలనునిందించడం పాలించే సత్తా లేకపోవడమేననిఆయన అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనవిధించాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌చేశారు. శాసనసభ సిఫార్సు రద్దును వారు తీవ్రంగా అభ్యంతరపెట్టారు. అయినా తాము ఎన్నికలను ఎదుర్కోవడానికిసిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X