తెలంగాణలో దేశం పతనం: కెసిఆర్‌

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 14-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: తెలంగాణలోఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓటమిఖాయమని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్‌ రావు అన్నారు. ఎన్నికల మానిఫెస్టోనుఆయన శుక్రవారం విడుదల చేశారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పతనం తప్పదనిఆయన అన్నారు. నక్సల్స్‌ను, ప్రతిపక్షాలను నిందిస్తూచంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమేముందస్తు ఎన్నికలకు సిఫార్సు చేశారని ఆయనవ్యాఖ్యానించారు. అయితే ఏ నిర్ణయమైన తీసుకోవడానికిచంద్రబాబుకు పూర్తి మెజారిటీ ఉన్నదని ఆయనఅన్నారు.

చంద్రబాబుకు అసెంబ్లీలో పూర్తిమెజారిటీ ఉన్నదని, కేంద్రంలో కూడా చంద్రబాబుకుఅనుకూలమైన ప్రభుత్వం ఉన్నదని, అటువంటప్పుడు శాసనసభనురద్దు చేయాల్సిన అవసరమేమిటని ఆయనఅన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదటి ముఖ్యమంత్రి దళితనాయకుడే అవుతారని ఆయన అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి