చదువుల పండుగ వారం వాయిదా

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 15-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: చదువుల పండగను ప్రభుత్వం వారం రోజుల పాటు వాయిదా వేసింది. చదువుల పండుగనుఅక్షర సంక్రాంతితో కలిపి నిర్వహించాలని నిర్ణయించింది. ఈవిషయాన్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారు.

ఈ నెల 17వ తేదీన ప్రారంభం కావాల్సిన చదువుల పండుగ 24వ తేదీన ప్రారంభమై వారం రోజుల పాటు సాగుతుంది. అన్ని పాఠశాల భవనాల నిర్మాణాలను మార్చి లోగా పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మధ్యలో బడిలో చేరే వారి కోసం అవసరమైతే హాస్టళ్లకు అదనపు గదులు సమకూరుస్తామని ఆయన చెప్పారు. నాలుగు గంటల పాటు ఆరు ప్రభుత్వ కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. వక్ఫ్‌ ఆస్తుల రక్షణకు అవసరమైతే కమిటీ వేస్తామని చంద్రబాబు చెప్పారు. అయితే సబ్‌ కమిటి ఒకటి వేశామని మంత్రి ఫరూఖ్‌ గుర్తు చేశారు. వక్ఫ్‌ ఆస్తుల రక్షణకు సంబంధించిన వివరాలను ఆ సబ్‌ కమిటీకి అందజేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి