ఢిల్లీలో కాంగ్రెస్‌ ఎడతెగని చర్చలు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 15-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు పార్టీ అధిష్ఠానవర్గంతో ఎడతెగని చర్చలు జరుపుతున్నారు. శుక్రవారం ఏడు గంటల పాటు చర్చలు జరిగాయి. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల నాయకులతో కూడా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడారు.

శనివారం రాష్ట్ర శాసనసభ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసుకుని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఆదివారం హైదరాబాద్‌ తిరిగి వెళ్తారు. వామపక్షాలతో, తెలంగాణ రాష్ట్ర సమితితో ఎన్నికల పొత్తు ఉంటుందనేవిషయాన్ని కాంగ్రెస్‌ నేతలు సూచనప్రాయంగా చెప్పారు. వచ్చేన 15 - 20 రోజుల్లో వామపక్ష నేతలతో, టిఆర్‌ఎస్‌తో పొత్తులపై మంతనాలు జరుగుతాయి.

అసెంబ్లీ రద్దుకు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిన కారణం సమంజంగా లేదని కాంగ్రెస్‌ నాయకులుఅంటున్నారు. ఫిబ్రవరి లోగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఎన్నికల కమీషనర్‌ లింగ్డో చేసిన ప్రకటనను రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌స్వాగతించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి