నలుగురు నక్సల్స్ ఎన్‌కౌంటర్
Posted on 15-11-03
హైదరాబాద్: రాష్ట్రంలో రెండు చోట్ల జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు నక్సల్స్ హతమయ్యారు. ఇందులో ముగ్గురు నిషిద్ధపీపుల్స్‌వార్ నక్సలైట్లు కాగా, ఒకరు సిపిఐ (యంయల్) ప్రజాదళం నక్సలైట్.
కడప జిల్లా వత్తలూరు గ్రామం వద్ద శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పీపుల్స్‌వార్ నక్సలైట్లు మరణించినట్లు సమాచారం. ఇందులో ఒక మహిళా నక్సలైట్ కూడా ఉంది. మెదక్ జిల్లా మోతే గ్రామం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో సిపిఐ (యంయల్) ప్రజాదళం నాయకుడు కనగల్ల యాదయ్య అనే నక్సలైట్ మరణించాడు. మరో ఇద్దరు తప్పించుకుని పారిపోయినట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications
