మహారాష్ట్రతో మాట్లాడాకే నిర్ణయం: అద్వానీ

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 16-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాతనే స్టాంపుల కుంభకోణంలో ఏం చేయాలనేవిషయం గురించి ఆలోచిస్తామని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ చెప్పారు. మహారాష్ట్ర గవర్నర్‌ మహ్మద్‌అఫ్జల్‌తో ఆయన ఆదివారం దాదాపు అరగంట సేపు మాట్లాడారు. ఆ తర్వాతవిలేకరులతో మాట్లాడారు.

కేంద్రం ఏం చేయదల్చుకున్నా మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిగే చర్చలను బట్టే చేస్తుందని ఆయన చెప్పారు. స్టాంపుల కుంభకోణం అంశాన్ని మహారాష్ట్ర గవర్నర్‌ ప్రస్తావించారని, అయితే దానిపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందన ఏమిటనేది ముఖ్యమని ఆయన అన్నారు. కుంభకోణం నివేదికల గురించి తాను గవర్నర్‌తో ప్రస్తావించలేదని ఆయన చెప్పారు. స్టాంపుల కుంభకోణంపై దర్యాప్తు చేపట్టాలని తాను సిబిఐని అడగలేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకే సిబిఐ దర్యాప్తు చేపట్టిందని ఆయన చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి