టిఆర్‌ఎస్‌, మజ్లీస్‌లతో పొత్తు: వైయస్‌

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 16-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌), మజ్లీస్‌లతో పొత్తులు ఖరారు కాగలవని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆయన ఆదివారంవిలేకరులతో మాట్లాడారు.

వామపక్షాలతో ఇప్పటికే సయోధ్య కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి నారా చంద్రబాబునాయుడును తప్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అభివృద్ధికి కాంగ్రెస్‌, శాంతిభద్రతల పరిరక్షణకు తీవ్రవాదులు అడ్డుపడుతున్నారని చేస్తున్నవిమర్శ చంద్రబాబు రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ రెండు రంగాల్లోవిఫలమైన ప్రభుత్వం ఎంత మాత్రం కొనసాడానికివీల్లేదని, ఇంతగా నిస్సహాయతను వ్యక్తం చేసిన ప్రభుత్వం ఆపద్ధర్మ బాధ్యతలు నిర్వహించడం సరికాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తీవ్రవాదాన్ని కాంగ్రెస్‌ సామాజిక సమస్యగానే పరిగణిస్తోందని ఆయన చెప్పారు. ప్రజాహిత బస్సు యాత్ర నాలుగైదు రోజుల్లో రాయలసీమలో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X