గుంటూరు సభకు టిడిపి భారీ ఏర్పాట్లు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 17-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

గుంటూరుః ఈనెల 19నగుంటూరులో జరుగనున్న తెలుగుదేశం బహిరంగసభతొలి ఎన్నికల ప్రచార సభ కానుంది. గుంటూరుశివారులో 34 ఎకరాల స్ధలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకుముందు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. గుంటూరు జిల్లానుంచే గాక కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి కూడా జనాన్ని సమీకరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా మంత్రులుకోడెల శివప్రసాద రావు, జెఆర్‌ పుష్పరాజ్‌ ఈ సభనిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

కోస్తా ఆంధ్రకు గుండెకాయవంటి గుంటూరులో జరిగే తొలి ఎన్నికల ప్రచార సభతెలుగుదేశం పట్ల కోస్తా ప్రజలప్రతిస్పందనకు గీటురాయి కానుంది. అధికార పార్టీకిఅన్ని హంగులు ఉంటాయి కాబట్టి జనాన్ని బాగాసమీకరించగలరు. కాబట్టి జనసంఖ్యను బట్టి కాకఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగానికి సామాన్య జనంస్పందనను బట్టి బలాన్ని అంచనా వేయవచ్చు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి