కాంగ్రెస్‌ తీరుపై టిఆర్‌ఎస్‌ మండిపాటు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 17-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్‌ రావు తీవ్రంగా మండిపడ్డారు. పొత్తులపై కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న ప్రకటనల పట్ల ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో ఆశ్చర్యం, విస్మయం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ నాయకులు వివిధ రకాల అస్పష్ట ప్రకటనలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై తాము కచ్చితంగా ఉన్నామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉండే పార్టీలతోనే తాము పొత్తు పెట్టుకుంటామని, తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటేనే కాంగ్రెస్‌తో తాము పొత్తుకు సిద్ధపడతామని తాము స్పష్టం చేశామని ఆయన వివరించారు. ఎన్నికల పొత్తుపై తాను కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. పొత్తు కోసం తామేమీ జోలె పట్టి కాంగ్రెస్‌ ముందు అడుక్కోవడం లేదని, తెలంగాణలో అతి పెద్ద పార్టీ తమదేనని, తమకు ఆ అవసరం లేదని ఆయన అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి