లంచం ఆరోపణ: మంత్రిజుదేవ్‌ రాజీనామా

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 17-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూఢిల్లీ: లంచం తీసుకుంటూ పట్టుబడిన కేంద్ర మంత్రి దిలీప్‌ సింగ్‌జుదేవ్‌ తన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఛత్తీస్‌ఘడ్‌,ఒరిస్సాలలో గనులు లీజుకు ఇచ్చేందుకు కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రిజుదేవ్‌ డబ్బు తీసుకుంటున్న దృశ్యాన్ని వీడియో రికార్డు చేశారు. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

జుదేవ్‌ను ఛత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రిగా కూడా ప్రతిపాదిస్తున్నారు.జుదేవ్‌ రాజీనామా చేసిన విషయాన్ని బిజెపి అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు ధృవీకరించారు. నైతిక బాధ్యత వహించి తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్లుజుదేవ్‌ చెప్పారు. తన రాజీనామా లేఖను ప్రధాని వాజ్‌పేయికి పంపినట్లు ఆయన తెలిపారు.

దిలీప్‌ సింగ్‌జుదేవ్‌ రాజీనామాను ఆమోదించారు. జుదేవ్‌పై వచ్చిన ఆరోపణల వల్ల ఉత్పన్నమైన పరిస్థితిని అంతకు ముందు ప్రధాని వాజ్‌పేయి, ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ, ఆర్థిక మంత్రి జస్వంత్‌సింగ్‌, బిజెపి అధినేత ఎం. వెంకయ్యనాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రమోద్‌ మహాజన్‌, లోక్‌సభలో బిజెపి చీఫ్‌ విప్‌వి.కె. మల్హోత్రా, సమాచార, ప్రసారాల మంత్రి రవి శంకర్‌ప్రసాద్‌ సమావేశమై చర్చించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి