ఉమపై దిగ్విజయ్‌ పరువు నష్టం దావా

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 17-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

భోపాల్‌: తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకురాలు ఉమాభారతిపై పరువు నష్టం దావా వేశారు. ఛీఫ్‌ జ్యుడిష్యల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఈ దావాను దాఖలు చేశారు.

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి బిజెపి అభ్యర్థిఅయిన ఉమాభారతికి ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ తరఫు న్యాయవాది ఈ నెల 14వ తేదీన నోటిసు ఇచ్చారు.ఇరవై నాలుగు గంటల లోగా క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు దిగుతామని ఆయన నోటీసులో చెప్పారు. ఎప్పటికప్పుడు ఉమాభారతి తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని దిగ్విజయ్‌ సింగ్‌అంటున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X