Home
Posted on 18-11-03
అసెంబ్లీ రద్దుపై తీర్పు వాయిదా
హైదరాబాద్: శాసనసభ రద్దుపై హైకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. శాసనసభ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై గత రెండు రోజులుగా వాదోపవాదాలు నడిచాయి. వాదోపవాదాలనువిన్న తర్వాత కోర్టు తన తీర్పును వాయిదా వేసింది.
శాసనసభ రద్దును సవాల్ చేస్తూ బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షుడుఆర్. కృష్ణయ్య ప్రజా ప్రయోజనాల పిటిషన్‌ను దాఖలు చేశారు. మంత్రి వర్గసిఫార్సు మేరకు గవర్నర్ శాసనసభను రద్దు చేయడం రాజ్యాంగవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్. రామచంద్రరావు అన్నారు. తమ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. శాసనసభ రద్దుకు చెప్తున్న కారణాలన్నీ ప్రభుత్వం పరిష్కరించాల్సినవేనని, తాను పరిష్కరించాల్సిన సమస్యలను పరిష్కరించకుండా శాసనసభ రద్దు కోరడం రాజ్యాంగవిరుద్ధమవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
