Home
Posted on 18-11-03
జోగీ రాజీనామా చేయాలి: పిఎం
జైపూర్: అవినీతివిషయంలో కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి విమర్శించారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎన్నికల ప్రచారాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి అజిత్ జోగి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అవినీతి ఆరోపణలు వచ్చిన బిజెపికి చెందిన కేంద్ర మంత్రి దిలీప్‌సింగ్‌జుదేవ్ రాజీనామా చేసిన విషయాన్ని వాజ్‌పేయి ప్రస్తావిస్తూ అదే కొలమానాన్ని జోగీకి ఎందుకు వర్తింపజేయరని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. జోగీపై చార్జిషీట్ ఉంది. జోగీ రాజీనామా చేయడమే కాకుండా కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది. జోగివిషయంలో విధానం ఎందుకు వేరుగా ఉండాలి? ఈ ప్రశ్నను నేను సోనియాగాంధీకి వేస్తున్నాను అని ఆయన అన్నారు. రాజస్థాన్‌లోని బికనూర్ ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నిర్దోషిగా తేలేంత వరకుజుదేవ్ మంత్రివర్గంలో చేరబోరని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
