Home
Posted on 18-11-03
బిజెపిపై సోనియా ధ్వజం
రాయ్‌పూర్: కేంద్ర దిలీప్‌సింగ్‌జుదేవ్ కుంభకోణం జాతిని దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. అవినీతిని,పేదరికాన్ని భారతీయ జనతా పార్టీ (బిజెపి) పెంచి పోషిస్తోందని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఛత్తీస్‌ఘడ్‌లోని భిలాయ్‌లో ఆమె మంగళవారం ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికిజుదేవ్ అభ్యర్థి కావడం వల్ల ఆ అవినీతి సంఘటన మరింతగా కలతకు గురి చేస్తోందని ఆమె అన్నారు. కొందరు మంత్రులు తమ నుంచి డబ్బులు అడుగుతున్నారని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులువిజిలెన్స్ కమీషన్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.స్వచ్ఛమైన, పారదర్శక పాలన అందిస్తామనే హామీని బిజెపి నిలబెట్టుకోలేకపోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
