Home
Posted on 18-11-03
స్టాంపుల స్కామ్: చెరో దారి
హైదరాబాద్: స్టాంపుల కుంభకోణం దర్యాప్తుపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చెరోదారిని ఎంచుకున్నారు. సిబిఐకి అప్పగించడం వైపు ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొగ్గు చూపగా ఆ అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు.
సుశీల్ కుమార్ షిండే మంగళవారం ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్‌తో లెండి ప్రాజెక్టుపై ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య స్టాంపుల కుంభకోణంపై, నక్సలైట్ సమస్యపై చర్చలు జరిగాయి. స్టాంపుల కుంభకోణం దర్యాప్తువిషయంలో మహారాష్ట్రకు అన్ని రకాలుగా సహకరిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ కుంభకోణంవిషయంలో మహారాష్ట్ర చిత్తశుద్ధిని తాను ఎప్పుడూ శంకించలేదని ఆయన స్పష్టం చేశారు. చాలా రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారమైనందున స్టాంపుల కుంభకోణంపై తాము సిబిఐ దర్యాప్తును కోరామని ఆయన చెప్పారు.
స్టాంపుల కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు అవసరం లేదని సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. తమ పోలీసుల దర్యాప్తు సంతృప్తికరంగా ఉన్నదని ఆయన అన్నారు. కేసు హైకోర్టులో ఉన్నదని కూడా ఆయన చెప్పారు. నక్సల్స్‌ను అదుపు చేసేందుకు సమన్వయంతో పని చేయాలని ఇరువురు నేతలు ఒకఅంగీకారానికి వచ్చారు.












Click it and Unblock the Notifications
