Home

Posted on 19-11-03

అస్సాంలో 13 మంది ఊచకోత

గౌహతి:అస్సాంలో 13 మంది బీహారీలను ఊచకోత కోశారు.అస్సాంలోని డిబ్రుఘర్‌, టిన్సుకియా జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో 13 మంది బీహారీలు హత్యకు గురయ్యారు. ఇందులో నలుగురు మహిళలున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకుసైన్యం రంగంలోకి దిగింది.

శాంతిభద్రతల పరిరక్షణలో పౌర పాలనాయంత్రాగానికి సహకరించేందుకుసైన్య సహాయం కోరినట్లు ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్‌ బుధవారం విలేకరులకు చెప్పారు. దాడి ప్రభావానికిగురైన ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. డిబ్రూఘర్‌ జిల్లాలో హిందీ భాష మాట్లాడే ప్రజలపై హింస చెలరేగుతోంది. ఇందులో భాగంగానే మంగళవారం రాత్రి బీహారీ కుటుంబానికి చెందిన ఆరుగురిని గుర్తు తెలియని వ్యక్తులు ఊచకోతకోశారు. 10 నుంచి 15 మంది కత్తులతో చిరువ్యాపారి ఉమాకాంత్‌ తివారీ ఇంటిలోకి చొరబడి అతడి భార్యను, ఇద్దరు మైనర్‌ కూతుళ్లను, కొడుకును, ఇద్దరు సన్నిహిత బంధువులను నరికి చంపారు. అనంతరం ఇంటికి నిప్పంటించి పారిపోయారు. ఈ ఘటన నుంచి తివారీ తప్పించుకున్నాడు.

టిన్సుకియా పట్టణంలో హిందీ మాట్లాడే ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. సారా బాటిలింగ్‌ ప్లాంట్‌కు దుండగులు నిప్పంటించిన మరో సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. దుబ్రీ జిల్లాలో జరిగిన మరో సంఘటనలో సాయుధ ఉల్ఫా తీవ్రవాదులు మోటార్‌సైకిళ్లపై వచ్చి బక్సీర్‌హట్‌ వద్ద గల డాబాపైవిచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు బీహారీ ట్రక్‌ డ్రైవర్‌ మరణించారు. ఏడుగురు గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+