Home
Posted on 19-11-03
చంద్రబాబు ఎన్నికల శంఖారావం
గుంటూరు: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం ఎన్నికల శంఖారావం పూరించారు. శాసనసభ రద్దు తర్వాత ఆయన బుధవారం తొలిసారిగా గుంటూరు బహిరంగ సభలో ప్రసంగించారు.
గుంటూరులో తెలుగుదేశం ప్రాంతీయ సదస్సు బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అంతకు ముందు గుంటూరులో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. ర్యాలీని చంద్రబాబు ప్రారంభించారు. వ్యక్తిగతంగా తనకు నక్సల్స్‌తో శత్రుత్వం లేదని, అయితే వారు అభివృద్ధికి అడ్డు పడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నక్సల్స్‌కు వంత పాడుతోందని ఆయన విమర్శించారు. ఆ కారణాల వల్లనే ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమయ్యామని ఆయన చెప్పారు. గుంటూరు రావడానికి ముందు ఆయన ప్రకాశం జిల్లాలో ఆయన ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
