గెలిచి తీరుతాం: బాబు ధీమా

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 19-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

గుంటూరు: వచ్చేఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తంచేశారు. గుంటూరు బహిరంగ సభకు ప్రజలఆదరణ చూస్తుంటే తనకు ఆ నమ్మకం కుదురుతోందనిఆయన అన్నారు.

ర్యాలీ అనంతరం జరిగిన గుంటూరుబహిరంగ సభలో ఆయన బుధవారం సాయంత్రం మాట్లాడారు.కాంగ్రెస్‌ గురించి మాట్లాడడం అనవసరమనిఅంటూనే ఆయన కాంగ్రెస్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉచిత కరెంట్‌ఇస్తామనే కాంగ్రెస్‌ హామీని ఆయన తీవ్రంగా విమర్శించారు.కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న 15 రాష్ట్రాల్లో ఉచితంగా కరెంట్‌ఇవ్వడం లేదని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌ మాట వింటే ఉచితంగా కరెంట్‌ ఇస్తారు గానీ కరెంట్‌రాదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వాగ్దానాలకుమోసపోవద్దని ఆయన ప్రజలను కోరారు. ఏవిధంగానైనా సరే తెలుగుదేశం పార్టీని ఓడించిఅధికారంలోకి రావాలనేదే కాంగ్రెస్‌ ఉద్దేశ్యమనిఆయన అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వహయాంలో ముఖ్యమంత్రులు మారిన వైనాన్నిఆయన గుర్తు చేశారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నాకాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీకి పరుగులు పెట్టాల్సిందేననిఆయన అన్నారు. అటువంటి సమస్యతెలుగుదేశం పార్టీకి లేదని ఆయన అన్నారు.

కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టునునిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గోదావరి నదిపైపోలవరం, ఇచ్చంపల్లి ప్రాజెక్టులను పూర్తిచేస్తామని, దీని వల్ల తెలంగాణ, కోస్తా మెట్ట ప్రాంతాలు సాగులోకివస్తాయని, తద్వారా కరువును సమర్థంగా ఎదుర్కోగలమనిఆయన అన్నారు. కృష్ణా డెల్టాకు ఈ ఏడాది పూర్తిగా నీరిచ్చిఆదుకున్నామని ఆయన చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలనుఆయన వివరించారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ద్వారా కోస్తాకు కూడానీరందిస్తామని ఆయన చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి