వాసిం అక్రమ్‌ను తీసుకోం: దాల్మియా

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 19-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

కోల్‌కత్తా: ఫాస్ట్‌ బౌలింగ్‌ శిక్షణ కోసంపాకిస్థాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ వాసిం అక్రమ్‌ను నియమించుకోవడంలేదని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడుజగ్‌మోహన్‌ దాల్మియా స్పష్టం చేశారు. వాసిమ్‌అక్రమ్‌ను నియమించుకోనున్నట్లు వచ్చినవార్తలను ఆయన బుధవారం విలేకరులసమావేశంలో కొట్టిపారేశారు.

ఫాస్ట్‌ బౌలింగ్‌ కచ్‌ గురించితాము ఆలోచిస్తున్న మాట వాస్తవమేనని, అయితేవాసిమ్‌ అక్రమ్‌ను అందుకు తీసుకోవాలనే ఆలోచన ఎప్పుడూచేయలేదని ఆయన అన్నారు. వాసిమ్‌ అక్రమ్‌నుఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా తీసుకోవాలని భారత క్రికెట్‌ జట్టుకెప్టెన్‌ గంగూలీ సూచించినట్లు వచ్చిన వార్తను ఆయన ఖండించారు. గంగూలీ అటువంటి ప్రతిపాదనేదీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X