Home

Posted on 19-11-03

పొత్తులపై మాట్లాడే వేళ కాదు: డిఎస్‌

హైదరాబాద్‌: ప్రాంతీయ కమిటీల ఏర్పాటుపై, పొత్తుల ఖరారుపై నిర్ణయం తమ అధిష్ఠానవర్గానిదేనని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ అన్నారు. ఇప్పుడే తాము ఎన్నికల పొత్తు గురించి మాట్లాడడం సరికాదని ఆయన బుధవారం అన్నారు.

పొత్తుల వివాదంలో ఈ సమయంలో తలదూర్చడం తమకు మంచిది కాదని ఆయన అన్నారు. మసీదును కూల్చివేసిన బిజెపితో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీదే అవకాశవాదమని, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అవకాశవాద రాజకీయాలే చేస్తోందని ఆయన అన్నారు. వామపక్షాలతో, తెలంగాణ రాష్ట్ర సమితితో తాము పెట్టుకోవాలనుకోవడం అవకాశవాదం కాదని ఆయన అన్నారు. పొత్తులపై, ఇతర విషయాలపై అధిష్ఠానవర్గంతో చర్చించడానికి ఆయన గురువారం ఢిల్లీ వెళ్తున్నారు.

ఆపద్ధర్మ ప్రభుత్వం హద్దులు దాటి ప్రవర్తిస్తోందని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి విమర్శించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శిలాఫకాలు వేయడం, వాగ్దానాలు చేయడం ప్రజలను మోసగించడానికేనని ఆయన అన్నారు. ఇది వరకు చంద్రబాబు వేసిన శిలాఫలకాలు సమాధిరాళ్లే అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+