గంగూలీపైఐసిసి సస్పెన్షన్ వేటు
కోల్‌కత్తా:దక్షిణాఫ్రికాతో జరిగే తొలి రెండుక్రికెట్ మ్యాచ్‌లకు భారత జట్టు కెప్టెన్‌సౌరవ్ గుంగూలీ దూరం కానున్నాడు. ఈరెండు మ్యాచ్‌లు అడకుండా గంగూలీపైఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)మ్యాచ్ రెఫరీ క్లైవ్ లాయిడ్‌సస్పెన్షన్ వేటు వేశారు. శనివారంఈడెన్ గార్డెన్‌లో పాకిస్థాన్‌తో జరిగినబిసిసిఐ ప్లాటినమ్ జూబిలీ వన్డే మ్యాచ్‌లోనిర్ణీత ఓవర్లను నిర్ణీత కాలవ్యవధిలోవేయనందుకు గంగూలీపై ఆ వేటుపడింది.
నిర్ణీతఓవర్ల వన్డేలో యాబై ఓవర్లనుమూడున్నర గంటలలో పూర్తి చేయాల్సివుంది. అయితే కోల్‌కత్తా మ్యాచ్‌లోభారత్ ఆ వ్యవధిలో యాబై ఓవర్లనువేయలేకపోయింది. దాంతో భారతజట్టుకు నాయకత్వం వహించినగంగూలీపై సస్పెన్షన్ వేటు పడింది.ఒక హోటల్‌లో విచారణ జరిగిన అనంతరంగంగూలీపై సస్పెన్షన్ విధించినవిషయాన్ని లాయిడ్ ప్రకటించారు.ఈడెన్‌గార్డెన్‌లో జరిగిన మ్యాచ్ సందర్భంగాఐసిసి ప్రవర్తనా నియమావళినిఉల్లంఘించినందుకు పాకిస్థాన్‌బ్యాట్స్‌మన్ యోహానాకు, భారత బౌలర్‌ఇర్ఫాన్ పఠాన్‌కు ఫీజు కోత పడింది.యోహానా ఫీజు మ్యాచ్‌లో డెబ్బై అయిదుశాతం, ఇర్ఫాన్ పఠాన్ ఫీజులో యాబైశాతం కోత పడుతుంది.











Click it and Unblock the Notifications
