టీచర్లఅసెంబ్లీ ముట్టడి వాయిదా
హైదరాబాద్:తమ డిమాండ్ల పరిష్కారానికిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి సానుకూలంగాప్రతిస్పందించడంతో ఉపాధ్యాయులు తమఅసెంబ్లీ ముట్టడిని వాయిదా వేసుకున్నారు.ఉమ్మడి సర్వీసు రూల్స్ ప్రకారం బదిలీలుజరగాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.ఏప్రిల్ మూడోవారంలో బదిలీలకు కౌన్సెలింగ్‌నిర్వహించడానికి ప్రభుత్వంఅంగీకరించింది.
తమడిమాండ్ల సాధన కోసం బుధవారంఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాల నుంచిదాదాపు నలబై వేల మంది ఉపాధ్యాయులునగరానికి చేరుకున్నారు. పలు చోట్లహైదరాబాద్ వస్తున్నఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు.
ఉపాధ్యాయులబదిలీలకు సంబంధించి ప్రభుత్వంహడావిడిగా ముప్పై మూడు నెంబర్‌జీవోను విడుదల చేసింది. ఈ జీవో కూడా తమసమస్యలకు పరిష్కారం కాదనిఉపాధ్యాయులు అన్నారు. జీవో విడుదలపైముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి ప్రాథమిక విద్యాశాఖమంత్రి రాజ్యలక్ష్మిపై మండిపడినట్లుతెలుస్తోంది. అయితే తన ప్రమేయంలేకుండా ప్రాథమిక విద్యాశాఖ ఉన్నతాధికారి ఆజీవోను విడుదల చేశారని రాజ్యలక్ష్మిముఖ్యమంత్రికి చెప్పినట్లుసమాచారం.












Click it and Unblock the Notifications
