వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాలహత్య కేసు: మరో నిందితుడి అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం:తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాలరవీంద్ర హత్య కేసులో కేంద్రదర్యాప్తు సంస్థ (సిబిఐ) మరొకరిని అరెస్టుచేసింది. పరిటాల హంతకులకుసహకరించాడనే ఆరోపణపై మరోనిందితుడు ఆనందరెడ్డి అలియాస్‌అనంత్‌ను సిబిఐ అరెస్టు చేసింది.ఆనందరెడ్డిని సిబిఐ అధికారులుమంగళవారం అనంతపురంఫస్టుక్లాస్‌ మెజిస్ట్రేట్‌ జైరాజ్‌ ముందుహాజరు పరిపచారు. అతనితో పాటు మరోఇద్దరిని కూడా మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు.

వీరినినాటకీయంగా మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. వీరిద్దరూ పరిటాల హత్య కేసులోసాక్షులని భావిస్తున్నారు. వీరి నుంచి సిబిఐఅధికారులు మొబైల్‌ ఫోన్‌ సాక్ష్యాలనుసేకరించినట్లు తెలుస్తోంది. వీరికి మార్చి ఏడువరకు జ్యుడిష్యల్‌ రిమాండ్‌ విధిస్తూమెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలావుంటే,పరిటాల హత్య కేసులో ప్రధానసూత్రధారి అని భావిస్తున్న చర్లపల్లిజైలులోని మద్దెలచెర్వుసూర్యనారాయణ రెడ్డి అలియాస్‌ సూరిఅనుచరుడు పవన్‌కుమార్‌నుహైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి నుంచితిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు.కాలుకు గాయమైందనే కారణంతోఅతడిని ఇటీవలి చికిత్స నిమిత్తంచర్లపల్లి జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికితరలించారు.

సిబిఐకేసు దర్యాప్తును చేపట్టినతర్వాత పెద్దిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, జి.వి. రెడ్డిలను అరెస్టు చేసింది.పరిటాల హత్య కేసులో నిందితుడునారాయణరెడ్డికి గాయానికి వైద్యంచేసినట్లు అనుమానిస్తున్న జి.వి.రెడ్డిభార్యను సిబిఐ అధికారులు ప్రశ్నించారు.పోస్టుమార్టం రిపోర్టును సిబిఐ అధికారులుతీసుకున్నారు. పలు కోణాల్లో కేసుదర్యాప్తును సిబిఐ ముందుకునడిపిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X