నాగంజనార్దన్ రెడ్డిపై సస్పెన్షన్‌ఎత్తివేత
హైదరాబాద్:తెలుగుదేశం శాసనసభా పక్షంఉపనేత డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డిపై సస్పెన్షన్ స్పీకర్ కె. ఆర్.సురేష్ రెడ్డి ఎత్తివేశారు.పార్లమెంటరీ వ్యతిరేక పదజాలంవాడారనే ఆరోపణపై నాగం జనార్దన్‌రెడ్డిని పది రోజుల పాటు స్పీకర్ శాసనసభనుంచి సస్పెండ్ చేసిన విషయంతెలిసిందే. అనంతరం మరో 27 మందితెలుగుదేశం సభ్యులను సస్పెండ్‌చేసి ఆ సస్పెన్షన్‌ను స్పీకర్‌మంగళవారంనాడేఉపసంహరించుకున్నారు. నాగంజనార్దన్ రెడ్డిపై సస్పెన్షన్‌నుమంగళవారంనాడుఉపసంహరించుకోలేదు.
నాగంజనార్దన్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ఉదంతాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులుబుధవారం ఉదయం సభ సమావేశంకాగానే లేవనెత్తారు. దీంతో సభాకార్యక్రమాలు స్తంభించాయి. ఈసమయంలో ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డి జోక్యంచేసుకొని ఒకానొక సందర్భంలోతెలుగుదేశం సభ్యులు సభనునడనివ్వరని అంటూ సభను వాయిదావేయాలని స్పీకర్‌ను కోరారు. నాగంజనార్దన్ రెడ్డి తరఫునతెలుగుదేశం సభ్యుడు యనమలరామకృష్ణుడు క్షమాపణ కోరారు.దాంతో నాగం జనార్దన్ రెడ్డిపైసస్పెన్షన్‌ను స్పీకర్ ఎత్తివేశారు.ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి, మంత్రులు అనుచితవ్యాఖ్యలు చేశారని యనమలరామకృష్ణుడు స్పీకర్ దృష్టికితెచ్చారు. నాగం జనార్దన్ రెడ్డిఉదంతం విషయంలో వ్యవసాయమంత్రి రఘువీరా రెడ్డితెలుగుదేశంపై తీవ్రంగాధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications
