వేంపెంటకుచెందిన 8 మందిని చంపిన నక్సలైట్లు

కర్నూలు:కర్నూలు జిల్లా వేంపెంట గ్రామానికిచెందిన ఎనిమిది మందిని మావోయిస్టునక్సలైట్లు కాల్చి చంపారు. నల్లమలఅడవికి పిలిపించి వారిని చంపారు. మరోఇద్దరి కాళ్లూ చేతులూ నరికివేశారు. 1998నుంచి మావోయిస్టు సానుభూతి పరులకు,సర్పంచ్‌ వర్గానికి మధ్య ఘర్షణలుజరుగుతున్నాయి. నెమలి శివారెడ్డి,శంకర్‌గౌడ్‌ల కాళ్లూ చేతులూనరికారు.

ఘర్షణలగురించి మాట్లాడాలని చెప్పి మావోయిస్టులుదాదాపు ముప్పై మందిని నల్లమల అడవికిపిలిపించారు. అక్కడికి వచ్చిన తర్వాతవిడివిడిగా మాట్లాడాలంటూ చెప్పి ఒక్కొక్కరినితీసికెళ్లి ఎనిమిది మందిని హత్య చేశారు. ఈఎనిమిది మంది శవాలు ముక్కలు ముక్కలుగానరకబడి బైర్లూతి అడవుల్లోనిరుద్రవీడు వద్ద గాలేరు ఒడ్డున లభించాయి. నక్సలైట్లు 1998లో బుడ్డావెంగళరెడ్డి అనుచరుడు వేంపెంటసర్పంచ్‌ శివయ్యను నక్సలైట్లు కాల్చిచంపారు. దీనికి ప్రతీకారంగా శివయ్యవర్గీయులు తొమ్మిది మంది నక్సలైట్‌సానుభూతిపరులను సజీవ దహనంచేశారు. దీనికి ప్రతీకారంగానేమావోయిస్టులు ఈ ఎనిమిది మందిని చంపినట్లుభావిస్తున్నారు. నక్సలైట్లసానుభూతిపరులకు, బుడ్డావెంగళరెడ్డి అనుచరులకు మధ్యకొన్నేళ్లుగా దేవుని మాన్యాలకుసంబంధించిన ఘర్షణలుజరుగుతున్నాయి.

సోమవారంరాత్రి వేంపెంట గ్రామస్థులనుమావోయిస్టులను నల్లమల అడవికితీసికెళ్లారు. ఈ విషయంమంగళవారంనాటికి గానీ పోలీసులకుతెలియరాలేదు. గ్రామంలో పరిస్థితిఉద్రిక్తంగా మారింది. అగ్రవర్ణాలఆధిపత్యాన్ని నిరసిస్తూనే ఈ ఎనిమిది మందినిచంపినట్లు మావోయిస్టులు ప్రకటించారు.

మావోయిస్టులచేతిలో మరణించినవారిని రవి, దావీద్‌,రాజేంద్రగౌడ్‌, గండ్లా సాములు, గాండ్లమురళి, జనార్దన్‌, శివయ్య,స్వామిదాసులుగా గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+