సోనియా ప్రకటన తెలంగాణకు అనుకూలమే: టిఆర్‌యస్
హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన ప్రకటన తెలంగాణకు సానుకూలమైందేనని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) అభిప్రాయపడింది. తెలంగాణ వ్యతిరేకులే సోనియా ప్రకటనకు విభిన్న అర్థాలు తీస్తున్నారని టిఆర్‌యస్ శాసనసభ్యుడు మందడి సత్యనారాయణ రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు.
సోనియా గాంధీ తెలంగాణ గురించి కొత్త ముచ్చటేమీ చెప్పలేదని, ఎన్నికల సమయంలో చెప్పిన మాటనే బుధవారం కాంగ్రెస్ బహిరంగ సభలో చెప్పారని, ఢిల్లీలోని తమ నాయకులతోనూ అదే విషయం చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ గురించి సోనియా గాంధీ మరోసారి మాట్లాడటం సంతృప్తికరంగా ఉన్నదని ఆయన అన్నారు. తెలంగాణపై సోనియా గాంధీ సానుకూలంగా ఉన్నారు కాబట్టే తెలంగాణపై త్రిసభ్య కమిటీ వేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications