వీరేంద్ర శెహ్వాగ్ వీరవిహారం
బెంగుళూర్: భారత్-పాక్ జట్లమధ్య ఇక్క డ జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజున భారత జట్టు ఆరు వికెట్ల నష్టానికి 379 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మన్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర శెహ్వాగ్ వీర విహారం చేశాడు. అతను 201 పరుగులు చేసి కె నేరియా బౌలింగ్‌లో అతని క్యాచ్‌కే ఔటయ్యాడు. శెహ్వాగ్ టెస్ట్ మ్యాచ్‌లలో మూడు వేల పరుగుల రికార్డును నేడు అధిగమించాడు. అతి తక్కువకాలంలో మూడు వేల పరుగులు దాటిన పరుగులు దాటిన భారతీయ క్రికెటర్ ఇతనే. ఓపెనర్‌గా వచ్చిన గౌతం గంభీర్ 24 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ ద్రావిడ్ 22, తర్వాత సచిన్ టెండుల్కర్ 41 పరుగులు చేశారు. వివిఎస్ లక్ష్మణ్ 51 పరుగులు చేయగా, కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒకే ఒక్క పరుగుతో పెవిలియన్ ముఖం పట్టాడు.












Click it and Unblock the Notifications
