టిఆర్‌యస్ సంయమనం పాటించాలి: కెకె
న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) సంయమనం పాటించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు సూచించారు. ఆయన శుక్రవారంనాడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకుని వివిధ అంశాల గురించి చర్చించారు. దాదాపు అరగంట సేపు ఆయన సోనియాతో సమావేశమయ్యారు. టిఆర్‌యస్ నేత కె. చంద్రశేఖర్ రావు తెలంగాణపై దురుసుగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.
తెలంగాణ విషయంలో తమ అభిప్రాయాలను తమ అధిష్ఠానవర్గానికి చెప్పామని, దాంతో సోనియా ఒక కమిటీ వేశారని, ఆ కిమటీ నివేదిక వచ్చే వరకు తెలంగాణపై మాట్లాడకపోవడం మంచిదని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని వివాదంగా మార్చకూడదని, ఎవరైనా అలా చేసినా దాన్ని వారి అభిప్రాయంగానే పరిగణించాలని ఆయన అన్నారు. పరస్పరం తిట్టుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు. రాజకీయాల్లో హుందాతనం, సంస్కృతి, రాజకీయ శైలి ఉండాలని ఆయన అన్నారు.
దండియాత్ర తరహాలో తాను పాదయాత్ర చేపడుతానని, దీన్ని తాను వరంగల్ నుంచి ప్రారంభిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
