ముఖ్యమంత్రిని కలిసిన గంగుల భానుమతి
హైదరాబాద్: అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితురాలు, మద్దెలచెర్వు సూర్య నారాయణ రెడ్డి అలియాస్ సూరి భార్య గంగుల భానుమతి ఆదివారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని కలిశారు. పెనుకొండ ప్రజల సమస్యలను విన్నవించడానికే తాను ముఖ్యమంత్రిని కలిసినట్లు భానుమతి చెప్పారు.
పెనుకొండ ఉప ఎన్నికల్లో టికెట్ ఎవరికిచ్చినా తమ మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుందని తాను ముఖ్యమంత్రికి చెప్పినట్లు ఆమె తెలిపారు. శాసనసభ సాధారణ ఎన్నికల్లో భానుమతి పెనుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థి పరిటాల రవిపై పోటీ చేసి ఓడిపోయారు. పరిటాల రవి హత్య కేసులో ఎఫ్ ఐ ఆర్‌లో భానుమతి పేరు కూడా ఉంది. రవి హత్య గురించి తన భార్య భానుమతికి తెలియదని సూరి సిబి ఐ ఇంటరాగేషన్‌లో చెప్పినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications
