తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు: టి.జి. వెంకటేష్
కర్నూలు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని రాయలసీమ హక్కుల వేదిక నాయకుడు టి.జి. వెంకటేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అవనసరమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆలూ లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అనే పద్ధతిలో టి ఆర్‌యస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ (రెండో ఎస్సార్సీ) లేకుండా తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడుతుందని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే పక్షంలో రాయలసీమకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక్క నీటి చుక్క కూడా రాయలసీమకు రాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications